24, ఏప్రిల్ 2010, శనివారం

మొత్తానికి ఈ రొజు హాల్ఫ్ మారథాన్ పూర్తి చేశాను. చిన్నగా చినుకులు పడుతూ వున్నాయి. ఉదయాన్నే లేచినా ఐ-పాడ్ బాగు చేసుకొని బయలుదేరెప్పటికి 8:00 అయ్యింది. మొత్తం 13.1 మైళ్ళు పరెగెత్తే టప్పటికి కరక్ట్ గా 3:00 గంటలు పట్టింది. నేనే ముందు అనుకొన్నను ఎవరూవుండరు అని కాని అప్పటికి కొంత మంది ఎదురు వచ్చారు. ఏమైనా ఉదయన్నే పరుగెత్తడమే వేరు. అదీ సన్నగ వర్షం పడుటుంటే అసలు అలసటే తెలీదు. వచ్చే ఆదివారమే ఫైనల్ డే. చాల అలసి పొయాను..నా సలహా ఏమంటె ఇలంటి పెద్ద రన్స్ ముందు రాత్రి బాగా తినాలి. వచ్చాక కొద్దిగ తిని ౫ గంటలు నిద్ర పోయా.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి